గత పది రోజుల నుంచి ధాన్యం కోనుగోలు అంశంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం… కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం తీరుకు నిరసనగా.. ఇవాళ ఇందిరా పార్క్ లో టీఆర్‌ఎస్ మహా ధర్నా చేస్తోంది. అయితే…ఈ మహా ధర్నాలో ఓ అరుదైన సంఘటన చోటు…
ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ…