మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు వెల్లడించారు.
Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ ఏడాది ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంటిపై భారత మువ్వన్నెల పతాకం ఎగవేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ…