Shubman Gill Likely To Miss IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ క్లీన్ స్వీప్ మీద భారత్ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం…
IND vs SL 3rd T20 Playing 11: శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే.. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో సాధించింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ పల్లెకెల వేదికగా మంగళవారం (జులై 30) రాత్రి జరగనుంది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని టీమిండియా పరీక్షించనుంది. ఈ విషయాన్ని రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్రమంలో భారత తుది జట్టులో…
Captain Charith Asalanka on Sri Lanka Defeat: మిడిలార్డర్‌పై విఫలమవడంపై శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో మిడిలార్డర్ బ్యాటర్లు ఆడలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. తాము అదనంగా 15-18 పరుగులు చేయాల్సిందని, వాతావరణం కూడా తమతో ఆడుకుందని తెలిపాడు. తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని అసలంక చెప్పాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన వర్ష ప్రభావిత రెండో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో ఓడింది. మ్యాచ్…
Suryakumar Yadav Speech after IND vs SL 2nd T20I: టీ20 ఫార్మాట్‌లో సానుకూల దృక్పథం, భయంలేని ఆట తీరుతో ముందుకు సాగుతామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్షం రావడం తమకు కలిసొచ్చిందని, బ్యాటర్ల ఆటతీరు అద్భుతం అని ప్రశంసించాడు. ఇప్పటి వరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటమని సూర్య చెప్పాడు. పల్లెకెలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.…
India Trash Sri Lanka in 2nd T20I: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులు కాగా.. 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 81 రన్స్ చేసింది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్…
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి భారత్ 161 పరుగులు చేసింది. భారత్ ముందు 162 పరుగుల ఫైటింగ్ టార్గెట్ ను ముందుంచారు.
ఇండియా-శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది.
కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.