Charith Asalanka: వాతావరణం కూడా మాతో ఆడుకుంది: శ్రీలంక కెప్టెన్
- 7 వికెట్ల తేడాతో ఓటమి
- మిడిలార్డర్‌పై శ్రీలంక కెప్టెన్ అసంతృప్తి
- ఇంకా బాగా ఆడాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Charith Asalanka on Sri Lanka Defeat: మిడిలార్డర్‌పై విఫలమవడంపై శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో మిడిలార్డర్ బ్యాటర్లు ఆడలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. తాము అదనంగా 15-18 పరుగులు చేయాల్సిందని, వాతావరణం కూడా తమతో ఆడుకుందని తెలిపాడు. తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని అసలంక చెప్పాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన వర్ష ప్రభావిత రెండో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ అసలంక మాట్లాడుతూ తమ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.
‘మేము బ్యాటింగ్ చేసిన విధానం బాగాలేదు. నాతో సహా మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైంది. నేను చాలా నిరాశ చెందాను. మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పిచ్‌లో బంతి పాతబడినా కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం ఇంకా బాగా ఆడాల్సి ఉంది. మేం 15-18 పరుగులు ఎక్కువగా చేయాల్సింది. దురదృష్టవశాత్తు వాతావరణం కూడా దాని పాత్ర పోషించింది. వాతావరణంను మనం నియంత్రించలేము. వర్షం పడటంతో 8 ఓవర్లు బౌలింగ్ చేయడం అంత సులభమైన కాదు’ అని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక చెప్పాడు.
Also Read
Also Read: Suryakumar Yadav: వర్షం మాకు కలిసొచ్చింది: సూర్యకుమార్
ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53; 34 బంతుల్లో 6×4, 2×6) టాప్ స్కోరర్. రవి బిష్ణోయ్ (3/26) మూడు వికెట్స్ తీశాడు. భారత ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడి గంటకు పైగా మ్యాచ్ ఆగింది. దీంతో లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. యశస్వి జైస్వాల్ (30; 15 బంతుల్లో 3×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (26; 12 బంతుల్లో 4×4, 1×6), హార్దిక్ పాండ్యా (22 నాటౌట్; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!