MS Dhoni’s Instagram Post Goes Viral: బార్బడోస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను భారత్ ఒడిసిపట్టింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన టీమిండియాకు రెండో కప్ గెలవడానికి 17 ఏళ్లు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవడంతో భారతదేశం మొత్తం ఆనందంలో తెలియాడుతోంది.…
Suryakumar Yadav Catch in IND vs SA Final: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా మాజీ బౌలర్ ఎస్ శ్రీశాంత్ పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బాదిన సిక్సర్ భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇక 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన…
Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ అనంతరం విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను…
Rohit Sharma Announce Retirement From T20 Internationals: టీమిండియా కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11…
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు పోరాటం చేసివిజయ కిరీటాన్ని సంపాదించడంతో సంబరాలు మొదలయ్యాయి. బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
IND vs SA , T20 World Cup 2024 Final Live Updates, India vs South Africa, T20 World Cup 2024 Final, T20 World Cup, India vs South Africa t20 World cup Final Match, Cricket, Sports News
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కోసం క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది, ఇది కాకుండా అర్ష్‌దీప్ సింగ్ కూడా తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు.