మరికాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా…