న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో నేడు చివరి రోజు ఆట ప్రారంభమైన కాసేప్పటికే కెప్టెన్ కోహ్లీ(13) ఔట్ కాగా అదే బౌలర్ వేసిన తర్వాతి ఓవర్లో పుజారా(15) కూడా పెవిలియన్ చేరుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కివీస్ పై 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ప్రస్తుతం…
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే కుప్పకూలాగా ఇప్పుడు కివీస్ 249 పరుగుల వద్ద ఆల్ ఔట్ ఔట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో రాణించగా ఇషాంత్ శర్మ 3, అశ్విన్ 2, జడేజా…
అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆట కూడా జరిగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. అయితే…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ”ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్” జరగడం ఇదే తొలిసారి. కాబట్టి అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈరోజు భారత్-కివీస్ మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ తొలి రోజు ఆటకు వరుణుడి గండం ఉన్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లాండ్ లో సౌథాంప్టన్ వేదిక జరగనుంది. కానీ అక్కడ ప్రస్తుతం వర్షాలు పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సిబ్బంది మైదానంలోని పిచ్‌ను కవర్లతో కప్పేశారు. అయితే ఈ మ్యాచ్ కు…
నేడు ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ ఆడనున్నారు. ఆ తర్వాత వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక జట్టులోకి జడేజాను తీసుకోవడంతో విహారి చోటు కోల్పోయాడు. మరో స్పిన్నర్‌గా అశ్విన్ అలాగే పేస్ విభాగంలో బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు చోటు దక్కింది.…
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ మ్యాచ్ కోసం కొన్ని రోజుల కిందట ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఆసీస్ సిరీస్ లో గాయం బారిన పడిన ఆల్‌రౌండర్ జడేజా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే డబ్ల్యూటీసీ…
ఇంగ్లాండ్ లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ లో భారత పేసర్ మొహ్మద్ షమీ విసిరిన బౌన్సర్‌కు కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తుంది. కోహ్లీ పక్కటెముకలకు గాయం అయినట్లు.. దాంతో అతను మూడు నుంచి ఆరు వారాలు ఆటకు దూరం కావాల్సి వస్తుందని సమాచారం. కానీ దీని పై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.…
ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న టీం ఇండియా మొదట న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుంది. అయితే ఈ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆడిన కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం పై తాజాగా కుల్దీప్ యాదవ్…
జూన్ 18 న న్యూజిలాండ్ తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో తలపడనున్న టీంఇండియా ఇంగ్లండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈరోజుతో అక్కడ మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో నేడు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందు ముంబైలో రెండు వారాల క్వారంటైన్ లో…
జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉంటె… ఈ ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ జెర్సీ 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను…