ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమితో ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్.. అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించాలని చూస్తోంది. బజ్‌బాల్ ఆటతో సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మరోసారి రసవత్తర పోరు సాగే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం…