బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4)లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా…
రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని, 40 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా? అని ప్రశ్నించారు. ఫీల్డింగ్ సెటప్ కూడా సరిగ్గా లేదని రవిశాస్త్రి మండిపడ్డారు. మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్…
టీమిండియా అంటేనే రెచ్చిపోయే బ్యాటరలలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. భారత జట్టుపై స్మిత్ హాఫ్ సెంచరీ, సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్‌లో శతకం బాదిన స్మిత్.. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేశాడు. స్మిత్‌కు ఇది టెస్ట్ కెరీర్‌లో 34వ సెంచరీ. అదేసమయంలో మెల్‌బోర్న్‌లో ఐదవ శతకం.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72) హాఫ్ సెంచరీలు బాదారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (49) తృటిలో అర్ధ శతకం కోల్పోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జ్‌లతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల బ్యాడ్జ్‌లను ధరించారు. రెండో రోజు మొత్తం ప్లేయర్స్ అందరూ నల్ల బ్యాడ్జ్‌లతో ఆడనున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. Also…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ అభిమాని బారికేడ్లు దాడి మరీ మైదానంలోకి దూసుకొచ్చి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. హగ్ చేసుకొనేందుకు కుదరకపోవడంతో.. కోహ్లీపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి.. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ బ్యాటర్లు మొదటి రోజులో హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రెండో రోజులో కూడా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్ (15) ఉన్నారు. ఈ సెషన్‌లో ఆసీస్ బ్యాటర్లు 27 ఓవర్లలో 143 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆతిథ్య ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజులో కూడా ఆధిపత్యం చేయిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్(15)లు క్రీజులో ఉన్నారు. మొదటి రోజు యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (60; 65 బంతుల్లో 6×4, 2×6), స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (72; 145 బంతుల్లో 7×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అయితే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను వెంటాడి మరీ ఔట్ అవుతున్నాడు. ట్రోఫీలో ఓ సెంచరీ మినహా అన్ని ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసే విషయంలో…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆసీస్ తన తుది జట్టును…