బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జ్‌లతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల బ్యాడ్జ్‌లను ధరించారు. రెండో రోజు మొత్తం ప్లేయర్స్ అందరూ నల్ల బ్యాడ్జ్‌లతో ఆడనున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీపై చేయి వేసిన అభిమాని.. మెల్‌బోర్న్ మైదానంలో కలకలం!
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. నాథన్ లైయన్ (13)ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ 10వ వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ (6) నాటౌట్‌గా నిలిచాడు. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ సాధించాడు. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72)లు హాఫ్ సెంచరీలు చేయగా.. ప్యాట్ కమిన్స్ (49) తృటిలో అర్ధ శతకం కోల్పోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీశాడు. ఇక భారత్ తన ఇన్నింగ్స్‌ను ఆరంబించనుంది.