కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం దిగిపోయేముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని డాక్యుమెంట్లలో, బోర్డుల మీద ఔరంగాబాద్ పేరును మార్చాల్సి ఉంటుంది. తాజాగా ఈ అంశంపై ఔరంగాబాద్ ఎంపీ, AIMIM పార్టీ నేత ఇంతియాజ్ జలీల్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా థాక్రే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. సాధారణంగా చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500…