Cricketer Died In Live Match: మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇమ్రాన్ సికందర్ పటేల్ అనే స్థానిక ఆటగాడు మైదానంలోనే మరణించాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం మేరకు 35 ఏళ్ల ఇమ్రాన్ స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. గరవాడే క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ ఎలెవన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.…