Manipur Violence: సీఎం ఇంటిపై దాడి.. కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్- మణిపూర్‌లో మరోసారి హింసకు కారణం?
- మణిపూర్‌లో ఉద్రిక్తతలు
- సీఎం ఇంటిపై దాడి, రెండు జిల్లాల్లో కర్ఫ్యూ
- ఇంటర్‌నెట్ సేవలు బంద్
- మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడానికి కారణం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిరసనకారులు రాష్ట్ర మంత్రులు సపమ్ రంజన్, ఎల్ సుసీంద్రో సింగ్, వై ఖేమ్‌చంద్ ఇళ్లను ముట్టడించారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురి ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేసి నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఎమ్మెల్యేలు-మంత్రుల ఇంటిపై దాడులు..
ఇంఫాల్‌లో దాడుల నేపథ్యంలో ఐదు జిల్లాలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపుర్‌లోని పలుచోట్ల ఇంటర్‌నెట్ సేవలను నిలివేసింది. జిరిబామ్ జిల్లాలో అనుమానస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన కారులు నిరసనలకు దిగారు. 24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోృ సీఎం బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
హింస చెలరేగడానికి కారణం…
నవంబర్ 11న భద్రతా దళాలు 10 మంది హ్మార్ పురుషులను చంపారు. ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరం నుంచి ఆరుగురు మైతే జాతి వారు అదృశ్యమై చివరికి వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు మణిపూర్‌లో తాజా హింసకు కారణమైయ్యాయి. హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి. అయినప్పటికీ కుకీ-జో కమ్యూనిటీ వారు గ్రామ వాలంటీర్లు అని పేర్కొంది. కుకీ మిలిటెంట్లు అపహరించిన ఆరుగురు మైతే బాధితుల్లో 25 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు, 31 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె, 60 ఏళ్ల మహిళ ఉన్నారు. జిరిబామ్ నుంచి గల్లంతైన ఆరుగురిలో ఒకరిగా భావిస్తున్న ముగ్గురి మృతదేహాలు జిరి నదిలో తేలియాడుతూ కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హింసాత్మక ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ ఎస్ పీఏ)ని తిరిగి విధించడంతో ప్రజల నిరాశ మరింత పెరిగింది. ఘర్షణను తగ్గించడంలో, ఏఎఫ్ఎస్పీఏ తిరిగి రావడాన్ని వ్యతిరేకించడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శించారు.
తాజావార్తలు
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!