Andhra Pradesh: ఏపీకి భారీ వర్ష సూచన.. ఇక, వానలే వానలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించడమే మానేశాయి.. అప్పుడప్పుడు.. ఓ మోస్తరు జల్లులు తప్ప.. పెద్ద వర్షం చూసి ఎన్ని రోజులు అయ్యిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. ఇక, వర్షాలు ముఖంచాటేయడంతో.. మెట్ట పంటలకు నష్టం తప్పేలా లేదని గొల్లుమంటున్నారు రైతులు.. నైరుతి రుతు పవనాలు హ్యాండ్ ఇవ్వడంతో ఈ సీజన్‌లో వర్షాలు కానరాకుండా పోయాయి.. అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది వాతావరణశాఖ.. వచ్చే నెలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది.. నాలుగైదు రోజుల్లో తిరిగి వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు..
Read Also: Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ఆగస్టు ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు ప్రయాణం చేసింది.. సాధారణంగా వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ.. ఇక, ఈ ద్రోణి హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా కొనసాగుతోంది.. ఇది క్రమంగా ఏపీకి విస్తరించనుంది.. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈసారి భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి విస్తరించింది ఉంది.. ఆ ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పాడమే ప్రమాదం పొంచిఉంది. కానీ, ఈ ద్రోణి సెప్టెంబర్ 1వ తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనా వేస్తుంది.. ఈ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు స్టార్ట్ అవుతాయని.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు.. అంటే వచ్చే నెలలో ఏపీలో సాధారణం లేదా అంతకు మించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?