ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీని సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి.
PaniPuri Effect: వర్షాకాలంలో రోడ్లపై విక్రయించే పానీపూరి తినవద్దని వైద్యులు సూచిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. తాజాగా పానీపూరి తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. హుగ్లీ జిల్లా డొగాచియాలోని ఓ స్టాల్ వద్ద పానీపూరీ తిన్నవారిలో చాలామందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు…
కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్ మాదాపూర్‌లోని గుట్టలభేగంపేట్ వడ్డెర బస్తీలో చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగడం వలనే బస్తీలో భీమయ్య అనే వ్యక్తి మృతి చెందాడని బస్తీ వాసుల ఆరోపణ చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వలన రాత్రి నుండి వాంతులు, విరేచనాలతో దాదాపు 20 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని బస్తీవాసులు వెల్లడించారు. కలుషిత నీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన…
దేశంలో హడలెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టేనా? అవునంటున్నారు నిపుణులు. అయితే, కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవంటున్నారు. కరోనా ముగిసినా కరోనా అనంతర పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు నిపుణులు. నిద్రలేమి, అలసట, డయాబెటీస్ నుంచి డిప్రెషన్ వరకు.. కొత్త సమస్యలుగా మారుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చినా ఈసారి అంతగా సీరియస్ కేసులు లేవనే చెప్పాలి. చాలామంది ఇంటిలో ఉండి వైద్యం తీసుకుని కోలుకున్నారు. కరోనా తగ్గిన తరవాత కొన్ని ఆరోగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆసుపత్రులకు వెళుతున్నారు. కొంతమంది…