హైదరాబాద్ లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు టీములుగా ఏర్పడి మూడు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసుల దృష్టిసారించారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శేర్లింగంపల్లి సిద్దిక్ నగర్ లో కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. Also Read:IND vs ENG: రిషబ్…
ఏపీలో ఎన్నికల వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB) అధికారులు పట్టుకున్నారు.
గుజరాత్ లో అక్రమ మద్యానికి ప్రజలు పిట్టల్లా రాతున్నారు. గుజరాత్ బోటాడ్ జిల్లాలో విషపూరితమైన మద్యం సేవించడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే అక్రమ మద్యం వల్ల ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలోమ 28 మంది మరణించారు. బోటాడ్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా.. ఈ రోజు మృతుల సంఖ్య 28కి చేరినట్లు డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు. ఈ విషాదకర ఘటనపై బర్వాలా, రాన్‌పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్‌లో…
ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా…
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మితిమీరిన ప్రవర్తనతో ఏపీలోని కొందరు పోలీసు అధికారులు క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారు.తాజాగా కృష్ణా జిల్లాలో ఓ ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఎ. కొండూరు (A,Konduru) ఎస్సై టి.శ్రీనివాసును సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. నిన్న ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన బాలాజీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాటుసారా కేసులో విచారణ పేరుతో ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ విచక్షణారహితంగా దాడి చేసిన…
వరంగల్ కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటి పల్లి, జవహర్ నగర్ కాలనీలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి అధ్వర్యంలో హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి, హన్మకొండ, సుబేదారి, మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు మరో 72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 బెల్ట్…