HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలలోని సర్వే నెంబర్ 193, 194 & 323లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వహిస్తుంది.
చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్‌లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి 3 జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అన
బహుళ అంతస్తుల కట్టడాలపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎండీఏ ఫోకస్ పెట్టింది. బుధవారం మరో పది అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో 33 నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం కూల్చి వేసింది.మూడో రోజు తూంకుంట, మణి కొండ, శంషా