Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.