ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి…