భారతీయ సంగీత ప్రపంచంలోనే.. తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను, మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. మహారాష్ట్రలో జరగనున్న, అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు, ఈ ఏడాది ‘పద్మపాణి’ పురస్కారాన్ని ఇళయరాజాకు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా వేల సంఖ్యలో అద్భుతమైన పాటలను అందించి, కోట్లాది మంది సంగీత ప్రియులకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ…