అసలే ఎన్నికల టైం. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఇవాళ పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా శనివారం 60 వేలమందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లు అందజేసింది. వీటిని అందుకున్న విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి…