కలియుగ వైకుంఠం తిరుమలలో భారీవర్షాలు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తిరుమల కొండకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఐఐటీ టీం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, అవి విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం నిర్మాణం అంశాలపై నివేదిక సమర్పించనుంది ఐఐటీ బృందం. తిరుమల ఘాట్ రోడ్డులో 10 సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే…