ఐఐటీ సూచనలతో తిరుమల ఘాట్ రోడ్డు సేఫేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలలో భారీవర్షాలు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తిరుమల కొండకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఐఐటీ టీం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, అవి విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం నిర్మాణం అంశాలపై నివేదిక సమర్పించనుంది ఐఐటీ బృందం. తిరుమల ఘాట్ రోడ్డులో 10 సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి.
పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే తదుపరి చర్యలపై నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం లింక్ రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్ళించే అంశం పై దృష్టి సారించామన్నారు. మోకాలి మిట్ట నుంచి జియన్ సి వరకు సమాంతరంగా రోడ్డు నిర్మించే అంశాన్ని టీటీడీ దృష్టికి తీసుకువెళతాం అన్నారు రామచంద్రారెడ్డి. తిరుమలలో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించామన్నారు ఐఐటీ నిపుణుడు కేయస్ రావు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్

తుఫాను ప్రభావంతో ఊహించని విధంగా వర్షం కురవడంతో 40 నుంచి 50 టన్నులు బరువు వున్న బండరాలు జారిపడ్డాయన్నారు. రెండు మూడు నెలల కాలంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. తిరుమల వెళ్ళే దారిలో 12 ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు వున్నాయని గుర్తించామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు పటిష్టంగానే వుందని, రాక్ ఫాల్స్ కారణంగానే రోడ్డు డ్యామేజి జరిగిందన్న నిర్దారణకు వచ్చారు. భవిష్యత్త్ అవసరాలు దృష్టిలో వుంచుకుని ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణం చెయ్యాలని సూచిస్తామని ఐఐటీ నిపుణులు చెప్పారు. వీరి సూచనలతో తిరుమల ఘాట్ రోడ్డు భద్రతా పరంగా పటిష్టంగా మారాలని భక్తులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!