ఆంధ్రప్రదేశ్ ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను రిలీజ్ చేశారు.
బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగించారు. నేటితో(జూన్ 19) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి శుక్రవారం వెల్లడించారు.
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బాసర ట్రిపుల్…
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్…