హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు…