Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు. Read…
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న ఆరంభ వేడుకలో తెలుగు సినిమా ఐకాన్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణని ఘనంగా సత్కరించనుంది. భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తన అపూర్వమైన నటనతో, దాదాపు 100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ చిత్ర సినిమాలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తీ చేసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ, బాలయ్య అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల ముగింపు వేడుకలో రజినీకాంత్, బాలయ్యను ఇఫీ – 2025 సత్కరించనుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ గోవాలో జరిగిన…