Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు.
Read Also : Ravi Babu : ఆ పోస్టర్ చూసి నన్ను తిట్టారు.. రవిబాబు కామెంట్స్
పుష్పగుచ్ఛం అందించి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సినీ సెలబ్రిటీలు బాలయ్యకు అభినందనలు చెబుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆ మూవీ భారీ అంచనాల నడుమ రాబోతోంది. ఇలాంటి సమయంలో ఆయనకు దక్కిన గౌరవంపై నందమూరి కుటుంబంలో సంతోషం నెలకొంది.
Read Also : SKN : మహేశ్ బాబు అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం