Balakrishna : ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణకి సన్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న ఆరంభ వేడుకలో తెలుగు సినిమా ఐకాన్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణని ఘనంగా సత్కరించనుంది. భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తన అపూర్వమైన నటనతో, దాదాపు 100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్యగారి 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని IFFI 2025 ప్రత్యేకంగా జరుపుకోనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, కళాకారులు, ప్రతినిధులు, సినీభిమానుల సమక్షంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు.
Also Read :Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఆరంభ వేడుకలో ప్రముఖ నిర్మాణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సాంస్కృతిక బృందాలు పాల్గొనే అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగమవుతాయి. ఇవి భారతీయ కథా సంప్రదాయం, సంస్కృతి, సినీప్రతిభను ప్రతిబింబిస్తాయి. పద్మభూషణ్, మూడు నంది అవార్డులు విజేత బాలకృష్ణ గారు తన అద్భుతమైన నటన, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, గొప్ప అభిమానంతో తెలుగు సినిమా ప్రపంచంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయ కథనానికి, తెలుగు సంస్కృతికి ఆయన ఒక గొప్ప ప్రతినిధి. తన తండ్రి లెజెండరీ ఎన్.టి. రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటసింహ నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా క్యాన్సర్ చికిత్స, పరిశోధనలకు విశేష సేవలు అందిస్తున్నారు. హిందూపూర్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన దశాబ్ద కాలంగా ప్రజా సేవలో ఉన్నారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..