Rogue elephant Arikomban captured: కేరళలోని ఇడుక్కి జిల్లా ప్రజలను నానాకష్టాలు పెడుతున్న ఏనుగు ‘అరికొంబన్’ ఎట్టకేలకు చిక్కింది. అధికారులు ఎనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఏనుగును పెరియార్ టైగర్ రిజర్వ్ కు తరలించారు. నిన్న తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం అయిన మిషన్ ఏనుగును గుర్తించలేకపోయింది. అయితే ఆదివారం మళ్లీ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఏనుగును గుర్తించారు.
గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…
కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆది వారం ఉదయం రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టాలు రెడ్ అలర్ట్ స్థాయికి చేరుకున్నాయి. పతనంతిట్ట, కొల్లాం జిల్లాల్లోనూ పలు రహదారులు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరా ల ప్రకారం ఈరోజు ఉదయం ముల్లపెరియార్ డ్యాంలో నీటి మట్టం 140 అడుగులకు చేరుకుందని ఇడుక్కి జిల్లా యంత్రాం గం తెలిపిం ది. జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగితే ఇడుక్కి రిజర్వాయర్ చెరుతోని డ్యామ్ షట్టర్లను…