మెగాస్టార్ చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయనకు అచ్చివచ్చిన నాయికలు మాధవి, రాధిక అనే చెప్పాలి. చిరంజీవి, రాధికతో ‘న్యాయం కావాలి’ చిత్రం నిర్మించిన క్రాంతి కుమార్, ఆ తరువాత వారిద్దరితోనే ‘కిరాయి రౌడీలు’, ‘ఇది పెళ్ళంటారా?’ తెరకెక్కించారు. ‘న్యాయంకావాలి’ సూపర్ హిట్ కాగా, ‘కిరాయి రౌడీలు’ హిట్ అనిపించుకుంది. ‘న్యాయం కావాలి’లో లాగే ‘ఇది పెళ్ళంటారా?’లోని కథాంశం కూడా మహిళా సమస్యపైనే రూపొందింది. 1982 జూలై 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి…