Off The Record: ఏపీలో ఏ పార్టీ అధినేత యాత్ర మొదలుపెట్టినా సెంటిమెంట్‌గా ఫీలయ్యే అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురం. శ్రీకాకుళం జిల్లాకు చివర్న, తెలుగు, ఒడియా సంప్రదాయాల కలబోతగా ఉండే ఈ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవలేదు. అప్పట్లో ఈ నియోజకవర్గానికి చాలా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అదే సమయంలో నన్ను మరోసారి గెలిపిస్తే… నియోజకవర్గాన్ని నందనవనం చేసేస్తా, వాళ్ళేంటి…