ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. భారత మహిళల అండర్-19 జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్‌గా సానికా చాల్కే వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ 18 జనవరి 2025 నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతుంది.