దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..