Tata Motors: భారత్‌లో అధికారిక లాంచ్‌కు ముందే హారియర్, సఫారి ఎస్‌యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లలో కంపెనీ కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. దీనికి ‘హైపీరియన్’ అనే పేరు పెట్టారు. ఇదే ఇంజిన్‌ను ఇటీవల ఆల్-న్యూ సియెర్రా మోడల్‌తో పరిచయం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్‌లో హారియర్, సఫారి ఎస్‌యూవీలను పరీక్షించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది.…