Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్‌తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ..