బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది.
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది.