HYDRA : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం భారీ స్పందన వచ్చింది. చెరువులు, కుంటలు, నాళాలు, రహదారులు, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ప్రత్యేకంగా పని చేస్తోంది. ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కారాన్ని అందించేందుకు ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నిర్వహించిన హైడ్రా…
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జనవరి 27) బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది. Also…