తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం హైడ్రా అక్రమ కట్టడాలను తొలగించింది. కోమటికుంట ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది.
HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలలోని సర్వే నెంబర్ 193, 194 & 323లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వహిస్తుంది.