తన బ్యాంక్ అకౌంట్ నుండి 1.2 కోట్లు మాయం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. హైదరాబాద్ ఖైరతాబాద్ కి చెందిన ఓ కుటుంబం సభ్యులైన నలుగురు పేరుతో బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసారు. కుటుంబంలోని అమ్మ నాన్న సోదరుడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జాయింట్ అకౌంట్ లో ఉన్న 2 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకునే ప్రయత్నం లో ఉంది ఆ మహిళ. ఇంతలోనే 1.2 కోట్లరూపాయలు ట్రాస్ఫర్ అయ్యాయని మహిళ నాన్న మొబైల్ కి మెసేజ్ వచ్చింది. దాంతో ఖంగుతిన్న మహిళ బ్యాంకు అధికారులను అడిగిన ప్రయోజనం లేకపోవడంతో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.