హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి…
బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. 265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి…
తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసులపై స్పందించారు. ఒమిక్రాన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నగర పోలీస్ కమిషనర్. ఇతర దేశాల నుండి వచ్చేవారు టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే బయటకి రావాలన్నారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గచ్చిబౌలి లోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నారు. బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు, వారితో కాంటాక్ట్ అయిన…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి…
క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా,…
నచ్చిన హోటల్‌కి వెళ్లి.. మెచ్చిన ఫుడ్ తిన్న తర్వాత.. సంతృప్తి చెందితే.. ఎవరైనా అక్కడి వెయిటర్‌కి టిప్పుగా కొంత డబ్బు ఇస్తుంటారు.. హోటల్, రెస్టారెంట్ రేంజ్‌ని బట్టి టిప్పు పెరిగిపోతుంటుంది.. కొందరు ఇవ్వకుండా వెళ్లిపోయేవారు కూడా లేకపోలేదు.. అయితే, టిప్పు ఇవ్వలేదని ఓ యువకుడిని వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో వెలుగు చూసింది.. Read Also: రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ బావార్చిలో…
సంచలనం సృష్టించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ వ్యవహారంపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు సీసీఎస్ పోలీసులు… కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసం రూ.3,520 కోట్లకు చేరినట్టు సీసీఎస్ పేర్కొంది.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీసీఎస్.. 5 వేల పేజీల ఛార్జ్సీట్లో కార్వీ సంస్థ మోసాలను పొందుపర్చారు.. 8 ఏళ్ల నుండి బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందిన ఆ సంస్థ.. కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంక్‌ల నుంచి రుణాలు…
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రితో ఓ అరుదైన సర్జరీ జరిగింది. కాలిన గాయాలతో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి హోమో గ్రాఫ్ట్ సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చనిపోయినవారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన తరువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు. కాలిన గాయాలపై స్కిన్‌తో సర్జరీ చేస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్దరి నుంచి చర్మాన్ని సేకరించినట్టు వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో చేసిన…
బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ యాంకర్ రవి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవాడిని కాదని.. కానీ తన కుటుంబసభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. Read Also: హ్యాట్సాఫ్.. మానవత్వం…