తల్లిదండ్రులు ఎవరైనా తాము కష్టాలు అనుభవిస్తున్నా తమ బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని చూస్తారు.. ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా వారికి అన్నం పెడతారు.. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు మాత్రం అందుకు విరుద్ధం .. వీరుచేసిన పని వింటే తల్లిదండ్రులకే మాయని మచ్చ తెచ్చారు అంటారు.. కన్నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడిల్సినవారు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు.. ఆమెకు ఇష్టంలేదని చెప్తే బలవంతంగా ఆమెను బెదిరించి ఈ రొంపిలోకి దించిన వారిని ఎట్టకేలకు…
‘ఆర్ఆర్ఆర్’ .. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ తర్వాత ట్రిపుల్ ఆర్ బృందం ప్రెస్ మీట్ పెట్టాల్సివుండగా.. కొన్ని కారణాలవలన ఈరోజుకు వాయిదా పడింది. ఇక…
హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్లో బస్తీ దవాఖానాను శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి హరీశ్‌రావు సనత్‌నగర్ పరిధిలో ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా…
జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్…
మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మీనారాయణ పనిచేశారు. తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.…
కరోనా వైరస్‌తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ…
ఈ మధ్య రిజర్వాయర్ల వద్ద జరగుతున్న నేరాలను అరికట్టేందుకు జలమండలి అధికారులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జలాశయాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ట్యాంకులో కుళ్లిన మృతదేహం రావడంతో అధికారులు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిఘా పరిధిలోకితేనున్నారు.రిజర్వాయర్ల వద్ద పర్యవేక్షణ, భద్రతపై జలమండలి ఎండీ దానా కిశోర్ ఆరా తీశారు. నగరంలో మొత్తం 378…
అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను…