ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది, సరి కాదు.. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.. అయితే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర మీటింగ్ పెట్టే దమ్ము ఎవరికుంది.. కాంగ్రెస్ కు లేదు, బీఆర్ఎస్ కు లేదు.. ఈ రెండు పార్టీలు నమాజ్ చేసి అక్కడ సభలు పెడుతాయి కావచ్చు.. కానీ బీజేపీ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కి సభ పెట్టింది అని ఆయన అన్నారు. అది చార్మినార్ కాదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారు కొలువైన భాగ్యనగరం.. పాత బస్తీ మీది కాదురా.. మాదేరా.. ఏ బస్తీ అయినా మాదేరా.. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో పొడిగించాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు( శుక్రవారం) బాధ్యతలను స్వీకరించారు. అయితే, నాలుగోసారి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ దగ్గర ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజురోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతుందని తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ లేని చోట్ల అధికార మదం, డబ్బు మదంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు.. అసలు ఆ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యనించారు.
Hyderabad: సాఫీగా సాగిపోతున్న జీవితాలను వివాహేతర సంబంధాలు నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల పవిత్ర బంధంపై అక్రమ సంబంధం పైచేయి సాధించిన ఘటనలు చాలానే ఉన్నాయి.
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక…