హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.…
హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జాడే శాండర్సన్ సందర్శించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ సంస్థల మధ్య స్కిల్లింగ్ రంగంలో సహకారానికి అవకాశాల కోసమే ఈ సందర్శన లక్ష్యం. ఈ సందర్భంగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యూహాత్మక సలహాదారు (ఇండియా) డాక్టర్ పాడీ రామనాథన్.. ఆరోగ్య నైపుణ్యంలో సంభావ్య సహకార మార్గాలను వెల్లడించారు. అంతేకాకుండా.. పిల్లల సంరక్షణలో అత్యుత్తమ కేంద్రంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను గుర్తించాలని సూచించారు.…
కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. కేంద్రంలోనీ అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ బాండ్ పేరుతో మోసం చేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న ( మంగళవారం ) సయ్యద్ అబ్బాస్ ఆలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.
ఈరోజుల్లో ఇంట్లో స్నాక్స్ చేసుకోవడానికి టైం లేక అందరూ బయట షాపుల్లో దొరికే వాటిని కొంటుంటారు.. ఈ మధ్య ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టం..సొంత బ్రాండ్ల తయారీలోనూ తమదైన మార్క్‌ను చూపుతున్నారు కొందరు కేటుగాళ్లు.. కళ్ళను కూడా మోసం చేసే విధంగా అందంగా ఫ్యాకింగ్ చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలుకు నకిలీ కలిపి మార్కెట్లో.. విక్రయిస్తున్నారు కల్తీగాళ్లు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ చూసిన అదే…
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దే ఫిజియోథెరఫీ, నర్సింగ్ సేవలు, ట్రీట్మెంట్ తరువాత చేసే వైద్య సేవలు చేయనుంది హెల్త్ ఆన్ అజ్ సంస్థ.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి అని కోరుకునే వాడినని అన్నారు. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. సమాజంలో అందరికీ ఆరోగ్య…
చికెన్ ధర చూస్తే కెవ్వుమనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో…