Increased toll fees: పెరిగిన టోల్ ఫీజులు..నేటి నుంచి అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Increased toll fees: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెం.65 లోని టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును రోడ్డు విస్తరణ కాంట్రాక్ట్ సంస్థ జీఎమ్మార్ పెంచింది. ఒక్కో వాహనంలో ఒకవైపు, రెండు వైపులా కలిపి రూ. 5 నుంచి రూ. 40 వరకు, స్థానీ కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిని రూ.2000 కోట్లతో 2012లో జీఎమ్మార్ ద్వారా నాలుగు లేన్లుగా విస్తరించారు.
Read also: TS Students Alret : తెలంగాణ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్..!
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చును రికవరీ చేసేందుకు గాను జీఎమ్మార్ ఏపిలోని కృష్ణాజిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున 65వ నెంబరు జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది. 2012 నుంచి కాంట్రాక్ట్ కంపెనీ వీటి ద్వారా టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. NHAI నిర్దేశించిన నిబంధనల ప్రకారం వార్షిక సవరణల పేరుతో సంవత్సరానికి ఒకసారి వాహనాల నుండి వసూలు చేసే టోల్ ఫీజు ధరలను పెంచడానికి GMAR సంస్థకు NHAI వెసులుబాటు కల్పించింది. పెరిగిన టోల్ ధరలు సంబంధిత టోల్ ప్లాజాల వద్ద 31వ తేదీ (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ధరలు ఏడాదిపాటు చెల్లుబాటవుతాయి.
TS Students Alret : తెలంగాణ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్..!
తాజావార్తలు
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!