శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఓవైపు కృష్ణా రివర్.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది..
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.
Rave Party Hyderabad: బెంగళూరు రేవ్ పార్టీ మరవకముందే అనేకచోట్ల మళ్లీ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. బర్తడే పార్టీ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలో 14 మంది యువకులు., ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పార్టీ నిర్వాకుడు నాగరాజ్ యాదవ్ తో…
Gold Cheating: తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ కొందరు ఈ మధ్య మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసం చేయబోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ వారు నమ్మబలుకుతూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.…
Ganja In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో మరోసారి గంజాయి గుప్పుమంది. నగరంలోని కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్ లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నెరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదివరకే ఆ గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై 5 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు అనగా గురువారం ఉదయం కోఠి లోని ఉస్మానియా…
అక్క తమ్ముడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్లో జరిగింది. తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది అక్క. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలంకు చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్లో తన మేనమామ నరేష్ వద్ద నివాసం ఉంటున్నాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
Mystery of Death: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో ముగ్గురు మృతుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కుమారుడు బాత్రూంలో మృతి చెంది కనిపించారు.
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు.