Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.…