హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహించారు. రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. మొత్తం రూ.1357.59 కోట్లు ప్రభుత్వంకు దక్కింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. వేలంలో ఇది…