స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చింది. మొదటి రోజే 21కిలోమీటర్లు తొక్కాను. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సమంత.. ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. ఇక సమంత…
ఉభయ తెలుగు రాష్ట్రాలపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. గులాబ్ విజృంభణతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో.. తెలంగాణలోని 14 జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, హైదరాబాద్‌లోనూ ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. సాయంత్రం నుంచి అయితే.. కుంభవృష్టే కురుస్తోంది.. ఈ ఎఫెక్ట్ క్రమంగా మూవీ నది ప్రభావంపై పడుతుండడంతో.. అప్రమత్తమైన అధికారులు.. మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.. ఇవాళ మూసీ 6…
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం.. నల్లటి మేఘాలతో చిమ్మ చీకటిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరద నీరు భారీగా చేరుకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్,…
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ…
హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్‌పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో…
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8…
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ…
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సాయంత్రం అయ్యిందంటే చాలు దంచికొడుతున్న వానలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. రేపు…
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.…