Flood Alert: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షం కారణంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందనే ఆందోళన మొదలైంది. భారీ వర్షం ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నగర పరిసర ప్రాంతాలకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని గొట్టిముక్కల వద్ద…
హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
CM Revanth Reddy : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. మున్సిపల్ ప్రాంతాల్లో వర్షపునీటి సమస్యలు తలెత్తకుండా డైవర్షన్ పనులు,…
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేసింది.
Hyderabad Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.