Flood Alert: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షం కారణంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందనే ఆందోళన మొదలైంది. భారీ వర్షం ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నగర పరిసర ప్రాంతాలకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని గొట్టిముక్కల వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా, ధరూర్ మండలం నాగారం వాగు కూడా ఉధృతి పెరగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
Physical Harassment: ఒంటరి మహిళను లైంగికంగా వేధించిన సీఐ.. కేసులో బిగ్ ట్విస్ట్!
మరోవైపు తాండూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జిల్లాలో అత్యధికంగా బషీరాబాద్ మండలంలోని కాసింపూర్‌లో 70.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. బషీరాబాద్ రైల్వే గేటు సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అంతేకాక, బషీరాబాద్ నుంచి మైల్వార్, ఎక్మై, మంతన్ గౌడ్ తండా మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లే రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ అకాల వర్షాల వల్ల భారీగా పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగలచ్ఛనుంది.
illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి తల్లి యత్నం..
అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడగా, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లిలో అత్యధికంగా 9 సెం.మీ. భారీ వర్షపాతం రికార్డవగా, పుల్కల్‌లో 7.4, కొండాపూర్‌లో 6.4, చౌటకూర్ 5.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లా రాఘవపూర్‌లో 5.1 సెం.మీ., మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 3.9 సెం.మీ. వర్షం కురిసింది. ఈ తాజా వర్షాల కారణంగా తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న జాడి మల్కాపూర్ జలపాతం ఉప్పొంగి కనువిందు చేస్తోంది.